Elon Musk: ప్రపంచ కుబేరుడు, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు తన వంతుగా సహకరించిన ఎలాన్ మస్క్ మరో బాంబు పేల్చారు. ట్రంప్ విధానాలపై తొలి నాళ్ల నుంచే వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన తాజాగా ట్రంప్ సర్కార్ తెచ్చిన మరో బిల్లును మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ దశలోనే నూతన పార్టీని ప్రకటిస్తానని ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఆ పార్టీకి పేరును సైతం ప్రకటించడం విశేషం.
Elon Musk: ది అమెరికా పార్టీ.. అనే పేరుతో కొత్త పార్టీ పెడతా అని ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాని ఆమోదం కోసం రిపబ్లికన్లు ప్రక్రియను మొదలు కూడా పెట్టారు. ఈ బిల్లు టెక్ సంస్థలపై నియంత్రణ, అభిప్రాయ స్వేచ్ఛపై ఆంక్షలు, సోషల్ మీడియా స్వేచ్ఛను హరిస్తే చర్యలు తీసుకునేలా ఉన్నదని ఎలాన్ మస్క్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
Elon Musk: బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ప్రజల హక్కులను హరించేలా ఉన్నదని, ఇది కనుక ఆమోదం పొందితే దేశ ప్రజల భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉన్నట్టేనని ఎలాన్ మస్క్ అభిప్రాయ పడ్డారు. ఒకవేళ ఈ బిల్లు కనుక ప్రభుత్వం ఆమోదం పొందితే.. ఆ మరుసటి రోజే ది అమెరికా పార్టీ అనే కొత్త పార్టీని ప్రారంభిస్తా అని ఆయన నిర్ధ్వంధంగా ప్రకటించారు.
Elon Musk: అమెరికా దేశ ప్రజలకు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయం పార్టీ కావాలని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుతో ఖర్చు పిచ్చిగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రిపబ్లికన్ నాయకులు భారీ ఖర్చుకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. అమెరికా సెనేట్లో ప్రస్తుతం ఓట్ల పోరు కనబడుతున్నది, ట్రంప్ రెండో పదవీ కాలానికి కీలకమైన ఈ బిల్లు ఆమోదం కోసం రిపబ్లికన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.