Elon Musk: ఎలోన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్ అని పిలిచేవారు) సోమవారం మూడుసార్లు డౌన్ అయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను కలవరపెట్టింది. మొదట మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో అరగంట పాటు డౌన్ అయింది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటల నుండి ఒక గంట డౌన్ అయింది. దీని తరువాత రాత్రి 8:30 నుండి 10:30 వరకు పూర్తిగా ఆగిపోయింది.
భారత కాలమానం ప్రకారం రాత్రి 10:55 గంటలకు మస్క్ పోస్ట్ చేస్తూ, ‘X పై భారీ సైబర్ దాడి జరిగింది. మేము ప్రతిరోజూ ఇలాంటి దాడులను ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ, ఈసారి అది చాలా సోర్స్ ల నుంచి ఒకేసారి జరిగింది. ఈ దాడిలో ఒక పెద్ద సమూహం లేదా ఒక దేశం పాల్గొని ఉండవచ్చు అని పేర్కొన్నారు.
వెబ్‌సైట్, యాప్- సర్వర్ కనెక్షన్ గురించి వినియోగదారులు ఫిర్యాదు చేశారు. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్‌లో భారతదేశం నుండి రోజంతా 4,000 కు పైగా ఫిర్యాదులు, US నుండి 18,000 కు పైగా ఫిర్యాదు, UK నుండి 10,000 కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. downdetector.in అనేది వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ సేవల అంతరాయాలను నిజ సమయంలో ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్.
డౌన్‌డెటెక్టర్ ప్రకారం, దాదాపు 41% మంది యాప్‌తో సమస్యలను ఎదుర్కొన్నారు. అదే సమయంలో, 51% మంది వెబ్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. దాదాపు 8% మంది సర్వర్ కనెక్షన్‌తో సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు.
Also Read: Air India Flight: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. 322 మందికి టెన్షన్!
గత రోజులో రెండు సార్లు
Elon Musk: ఏప్రిల్ 26, 2024న, మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో, X పని చేయకుండా పోయింది. డౌన్ డిటెక్టర్‌లో Xని ఉపయోగించడంలో 145 మంది సమస్యలను రిపోర్ట్ చేశారు. వెబ్ – యాప్ రెండింటిలోనూ దీన్ని ఉపయోగించడంలో వినియోగదారులు సమస్యలను ఎదుర్కొన్నారు.
డిసెంబర్ 21, 2023న కూడా, X సేవ నిలిచిపోయింది. గురువారం ఉదయం 11 గంటల నుండి భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు Xని యాక్సెస్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. పోస్ట్‌కు బదులుగా, వినియోగదారులు ‘Welcome to X’ అని ఉన్న సందేశాన్ని చూస్తున్నారు.
స్టాటిస్టా ప్రకారం, X కి ప్రపంచవ్యాప్తంగా 611 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. దీనికి అమెరికాలో 9.5 కోట్ల మంది వినియోగదారులు, భారతదేశంలో 2.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రతిరోజూ దాదాపు 50 కోట్ల పోస్టులు జరుగుతాయి. ఇది జూలై 2006 లో ఇది ప్రారంభమైంది.