టెన్షన్ టెన్షన్.. హర్యానాలో మారుతున్న ట్రెండ్

జమ్ముకశ్మీర్‌, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నది. కశ్మీర్ లో ఆధిక్యం దిశగా కాంగ్రెస్‌, ఎన్సీ కూటమి దూసుకెళ్తున్నది. మొత్తం 90 స్థాలకు గాను కాంగ్రెస్‌ కూటమి 50 చోట్ల లీడ్‌లో ఉండగా, బీజేపీ 27 సీట్లలో ముందంజలో ఉన్నది. ఇక పీడీపీ 4, ఇతరులు 9 చోట్లు ఆధిక్యంలో ఉన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 48 చోట్ల విజయం సాధించాల్సి ఉంటుంది.

మరోవైపు హర్యానాలో సైతం ఇవే ఫలితాలు కనపడుతున్నాయి. తొలుత ఇక్కడ హస్తం పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. రాష్ట్రంలోని 90 సీట్లలో 63 చోట్ల ముందంజలో కొనసాగగా.. బీజేపీ 23 స్థానాలకు పరిమితమైంది.

ప్రస్తుత ట్రెండ్‌ ప్రకారం.. బీజేపీ 46 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతుండగా.. కాంగ్రెస్‌ 38 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఐఎన్‌ఎల్‌డీ మూడు స్థానాలు, ఇతరులు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *