ED: ఆన్‌లైన్ ద్వారా మనీలాండరింగ్‌కు సంబంధించి ఢిల్లీలో తనిఖీలకు వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై దాడి ఘటన కలకలం రేపింది. ఢిల్లీలోని కపషేరా ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. యాప్ ఆపరేటర్ పీవైపీఎల్‌పై మనీలాండరింగ్ కేసు విషయంలో ఈ సోదాలు జరిగాయి.తనిఖీలకు వెళ్లిన ఈడీ అధికారులకు అక్కడ నిందితులు షాక్ ఇచ్చారు. అశోక్ శర్మ, అతని సోదరుడు సహా ఐదుగురు వ్యక్తులు తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై దాడి చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారికి స్వల్ప గాయాలయ్యాయి.ఈ విషయమై పోలీసు కేసు నమోదైంది. దాడి చేసిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు.