Mahaa News Effect: రైస్ మాఫియా తిమింగలం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. కాకినాడ పోర్ట్ లో 6 వేల టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయిస్ మంత్రిగా నాదెండ్ల మనోహర్ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్న వైనంపై సీరియస్ గా ఉన్నారు. గతంలో కూడా కాకినాడ పోర్ట్ నుంచి అక్రమంగా తరలిపోతున్న పీడీఎస్ బియ్యాన్ని స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టుకుని సీజ్ చేయించారు. అయినా అక్రమార్కులు వెనక్కి తగ్గడం లేదు. దీంతో తాజాగా మళ్ళీ మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. గంగవరం పోర్టుతో పాటు కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలకు ఉపక్రమించారు.
ఈ నేపథ్యంలో పీడీఎస్ బియ్యానికి రెక్కలు వస్తున్న విధానంపై మహాన్యూస్ రెండురోజులుగా ప్రత్యేక కథనాలు ఇస్తూ వస్తోంది. ఈకథనాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. పిడిఎస్ రైస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం అయింది. మరికాసేపట్లో కాకినాడ పోర్ట్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకోనున్నారు.
సౌత్ ఆఫ్రికా వెల్లెందెందుకు రేషన్ బియ్యం తొ రెడీ గా ఉన్నా స్టెల్లా షిప్ ను పరిశిలించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా రాత్రి మరో బాచిలో వేలాది టన్నుల రైస్ నిల్వలు అధికారులు గుర్తించారు. గోడౌన్లలో పెద్ద ఎత్తున రేషన్ రైస్ ను సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పట్టుకున్నారు.
Mahaa News Effect: ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నప్పటికీ రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ కంట్రీలకు ఏదోఒక విధంగా రైస్ మాఫియా తరలిస్తూనే వస్తోంది. కాకినాడ కేంద్రంగా లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్టర్ భారీగా రేషన్ రైస్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రైస్ మాఫియా ఆగడాలకుఅధికారులు కొమ్ము కాస్తున్న పరిస్థితి. దీంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవ్యంగా రంగంలోకి దిగారు. మరి కొద్దీ సేపట్లో కాకినాడ పోర్ట్ కి వెళ్ళనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్.. ఉదయం 10 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. 11 గంటలకు కాకినాడ పోర్ట్ కి చేరుకుని పోర్టులో పీడీఎస్ బియ్యం ఉన్న షిప్ ను పరిశీలించి తిరిగి వెనక్కి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్.
పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం పలికిన జనసైనికులు:
ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్. రోడ్డు మార్గాన కాకినాడ బయలుదేరి వెళ్తున్నారు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన నాయకులు అధికారులు జనసైనికులు అభిమానులు