Anil Ambani-ED: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌పై మనీలాండరింగ్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే గ్రూప్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా, సతీశ్ సేథ్ సహా పలువురికి ఈడీ సమన్లు జారీ చేసింది. వారి ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు కూడా నిర్వహించింది.
ఈ కేసులో అనిల్ అంబానీకి స్వయంగా ఈడీ నోటీసులు పంపింది. ఆయనను ఈరోజు (ఆగస్టు 5) విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాదు, ఆయన విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా లుక్‌అవుట్ సర్క్యులర్ (LOC) కూడా జారీ చేసింది.
రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై భారీ రుణాల మోసం ఆరోపణలు
ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, రిలయన్స్ గ్రూప్‌కు చెందిన మూడు కంపెనీలు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.17,000 కోట్ల రుణాలను అక్రమంగా వేరే కంపెనీలకు మళ్లించినట్లు అనుమానం.
- 
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ – రూ.5,901 కోట్లు 
- 
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ – రూ.8,226 కోట్లు 
- 
రిలయన్స్ కమ్యూనికేషన్స్ – రూ.4,105 కోట్లు 
ఈ మొత్తం మొత్తాన్నీ బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకొని వాస్తవంలో ఎలా వినియోగించారన్నదానిపై ఈడీ ఇప్పుడు విచారణ చేపట్టింది.
ఇది కూడా చదవండి: Kamal Haasan: సనాతన సంకెళ్లపై యుద్ధం.. కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు!
బ్యాంకు అధికారులపైనా దర్యాప్తు
ఈ కేసులో 20 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేయనుంది. అంబానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు మంజూరు చేసినప్పుడు వారు ఏమేం పరిశీలించారు? రుణాలు తిరిగి చెల్లించని తర్వాత వారు ఏ చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై ఈడీ ప్రశ్నించనుంది.


