ED Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి పెట్టింది. ఈ మేరకు కేసు వివరాలపై ఆరా తీస్తున్నది. మాజీ మంత్రి కేటీఆర్, ఇతర అధికారులపై నమోదైన ఈ కేసు వివరాలు, ఎఫ్ఐఆర్ కాపీతోపాటు హెచ్ఎండీఏ ఖాతా నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారోనన్న వివరాలను, వాటి తేదీల వివరాలు ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులను ఈడీ కోరింది. దీనిపై ఈడీ కూడా కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం.
ED Case: ఏసీబీ కేసు నమోదు చేయడంతో వెంటనే ఈడీకి సమాచారం చేరింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేస్తున్నట్టు తెలుస్తున్నది. నగదు విదేశాలకు తరలిపోవడంతో పీఎంఎల్ఏతోపాటు ఫెమా చట్టాల కింద కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం. ఈడీ ఎట్టి పరిస్థితుల్లో కేసు నమోదుకే మొగ్గు చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ED Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై విచారణ కోసం ఏసీబీ ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఆ మేరకు ఇప్పటికే ఏసీబీ తన విచారణను మొదలుపెట్టింది. తొలుత ఫిర్యాదు దారు దానకిషోర్ నుంచి వివరాలు సేకరించే పనిలో పడింది. ఆ తర్వాత మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి ఐఏఎస్ అధికారులైన అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై విచారణ జరపనున్నారు. ఇదిలా ఉండగా, ఇదేరోజు ఏ1 నిందితుడైన కేటీఆర్‌ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.