Eatala Rajender: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ మూసి రివర్ ఫ్రంట్ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేస్తాని ప్రభుత్వం మార్కింగ్ చేసిన వారిని బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పాయల శంకర్ రాజేంద్రనగర్ ఇన్చార్జ్ బిజెపి తోకల శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని మూసి రివర్ ఫండ్ బాధితులతో పాటు ఎఫ్డిఎల్లో నిర్మాణాల ఉన్న పేద ప్రజలకు బిజెపి అండగా ఉంటుందని ఈటల రాజేందర్ తెలిపారు.
బాల్ నగర్ జీడిమెట్ల ప్రాంతంలో కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారు గర్భిణీ స్త్రీ అని చూడకుండా కూడా నువ్వు ఇప్పుడు ఖాళీ చేస్తేనే నీకు డబల్ బెడ్రూం ఇల్లు వస్తుంది లేదంటే డబల్ బెడ్ రూమ్ కూడా రాదని అధికారుల భయాందోళనకు గురి చేస్తున్నారు ఈటల రాజేందర్
Eatala Rajender: పేద ప్రజలను ఇళ్లలోని కూల్చివేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలతో పాటు మూసి అభివృద్ధి చేశామని చెప్పుకోవడానికి కూడా ముందుగా ప్రభుత్వం నడిపేటప్పుడు పేద ప్రజలను చూడాలని ఎంపీ ఈటల రాజేందర్ అన్నరు.
మూసి అభివృద్ధి అంటే మూసిలో ఉన్న నీరుని మంచినీరుగా లేదంటే ఏదైనా ఉపయోగపడే నీరుగా మారుస్తానంటే సహకరిస్తాం కానీ పేద ప్రజల జోలికి వస్తే ఊరుకునేది లేదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాపై కూడా ఇష్టమున్నట్టుగా అంటున్నాడు నన్ను అన్న పరవాలేదు కానీ పేద ప్రజల ఇళ్ల జోలికి రాకుండా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా మూసి అభివృద్ధి చేసుకో దానికి మేము సహకరిస్తాం చేతులు జోడించి నమస్కరిస్తున్నాను అని ఈటల రాజేందర్ తెలిపారు.

