అస్సాంలో భూకంపం సంభవించింది. బ్రహ్మపుత్ర ఉత్తర ఒడ్డున ఉన్న ఉదల్‌గురి జిల్లాలో ఉదయం 7:47 గంటలకు భూకంపం వచ్చింది.15 కిలోమీటర్ల లోతులో భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దర్రాంగ్, తముల్‌పూర్, సోనిత్‌పూర్, కమ్రూప్, బిస్వనాథ్ జిల్లాల్లో కూడా స్వల్పంగా ప్రకంపనలు నమోదయ్యాయి.
పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు తూర్పు భూటాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించవచ్చని అధికారులు పేర్కొన్నారు.ప్రకంపనలు రావడంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.