Durandhar

Durandhar: ఇండియాని షేక్ చేసేలా దురంధర్ ఫస్ట్ సాంగ్?

Durandhar: దురంధర్ సినిమా తొలి గీతం అదిరిపోనుందట. ఫస్ట్ పాటతోనే దేశావ్యాప్తంగా హైప్ సృష్టించాలని ప్లాన్ చేస్తుంది టీం. రణవీర్ సింగ్‌తో సహా యావత్ తారాగణంతో ఈ ప్రమోషనల్ సాంగ్ రూపొందనుంది. దీపావళి సందర్భంగా విడుదలై, డిసెంబర్ 5న సినిమా రిలీజ్‌ను ఘనంగా ప్రకటించనుంది. పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: GV Prakash: విడాకులు తీసుకున్న జీవీ ప్రకాష్, సైంధవి

దురంధర్ సినిమా ఫస్ట్ సాంగ్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ గీతం చిత్రంలోని ముఖ్య సన్నివేశాలతో కూడిన ఒక విజువల్ ట్రీట్‌గా రూపొందనుంది. రణవీర్ సింగ్ ఎనర్జీతో నిండిన నటన, స్టార్ కాస్ట్ డాన్స్ మూమెంట్స్ ఈ పాటను హైలైట్ చేయనున్నాయి. దీపావళి సీజన్‌లో విడుదల చేసే ఈ సాంగ్, సినిమాపై అంచనాలను మరింత పెంచనుంది. ఈ చిత్రం యాక్షన్, డ్రామా, ఎమోషన్స్‌తో నిండిన ఒక ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ Uri: The Surgical Strike దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తూ కో ప్రొడ్యూసర్ గా కూడా బాధ్యతలు తీసుకున్నాడు. ఆదిత్య ఈ సినిమా కథను ఒక కొత్త శైలిలో చెప్పనున్నారని సమాచారం. ఈ సినిమాలో నాన్న, పొన్నియిన్ సెల్వన్ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా నుంచి రాబోయే మొదటి పాట యువతను ఆకర్షించేలా, ఇండియాని షేక్ చేసేలా ఉంటుందని, సోషల్ మీడియాలో కచ్చితంగా వైరల్ అవుతుందని టీమ్ ఆశిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *