SVC58

SVC58: డబ్బింగ్ పనుల్లో వెంకీ, అనిల్ రావిపూడి సినిమా!

SVC58: విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి జోరు చూస్తుంటే… వారు ముందు చెప్పినట్టు సంక్రాంతికి వచ్చేట్టే ఉన్నారు. మరోవైపు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సైతం సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అవుతోంది. అదే సీజన్ లో వెంకీ, అనిల్ మూవీనీ దిల్ రాజు విడుదల చేస్తారనే ఫిల్మ్ నగర్ టాక్! దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఇప్పటికే 90 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరో వైపు డబ్బింగ్ పనులనూ మొదలెట్టేశారు. ఈ సినిమా ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ హామీ ఇస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ ఫిమేల్ లీడ్ రోల్స్ చేశారు. దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hit 3: ‘హిట్ 3’లో విశ్వక్ సేన్ మిస్సింగ్ ఎందుకంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *