Dubai New passport Rules 2025: ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలను ఆకర్షిస్తున్న దుబాయ్.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. పాస్‌పోర్ట్ నిబంధనల్లో అక్కడి ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ముఖ్యంగా వివిధ దేశాల నుంచి వచ్చే వారిలో నేరస్థులు అధికంగా ఉంటున్నారని, తప్పుడు ఆకారాలతో, తప్పుడు పాస్‌పోర్టులతో తమ దేశంలోకి వస్తున్నారని ఈ కీలక మార్పులకు ప్రాధాన్యం ఇస్తున్నది.
Dubai New passport Rules 2025: పాస్‌పోర్ట్‌లో ఉండే ఫొటో స్పష్టంగా ఉండాలని, బ్యాక్‌గ్రౌండ్ తెల్లగా ఉండాలని, ఫొటో సైజు 630×810 ఫిక్సెల్ ఉండాలని, ఫొటోలో ముఖం 85 శాతం స్పష్టంగా కనిపించాలని ఆ నిబంధనల్లో పేర్కొన్నారు. ఫొటో మొత్తం ఒకే రకమైన లైటింగ్ ఉండాలని, ఫొటోలో ఎలాంటి హావభావాలు ఉండకూడదని, ఫొటోను ఎడిట్ చేయడం, ఫిల్టర్లు వాడటం ఉండొద్దని, కళ్లజోడు ధరించవద్దని, ముఖంపై ఎలాంటి వస్త్రాలు కప్పుకోవద్దని పేర్కొన్నారు.
Dubai New passport Rules 2025: దరఖాస్తు సమర్పించే ఫొటో మూడు నెలల క్రితంది అయి ఉండొద్దని, ముఖంపై ఎలాంటి నీడలు లేదా మెరుపులు ఉండొద్దని, చర్మం రంగు సహజంగా కనిపించాలని, మతపరమైన కారణాలతో తల కప్పుకునే వారికి మినహాయింపు ఉన్నది. కానీ ముఖంలో అన్ని భాగాలు (గడ్డం నుంచి నుదురు వరకు, ముఖం అంచులు) స్పష్టంగా కనిపించాలని తెలిపారు.
Dubai New passport Rules 2025: పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే పాస్ పోర్ట్ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుందని దుబాయ్ భారతీయ కాన్సులేట్ సూచించింది. దీనివల్ల పాస్‌పోర్ట్ ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నది. భద్రత కూడా మెరుగవుతుందని చెప్పింది.