Crime News

Crime News: సోయిలేకుండా తప్పతాగాడు . . భార్యను . . అత్తను కత్తితో ఏం చేశాడంటే . .

Crime News: హైదరాబాద్‌ మియాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు తన భార్య, ఇంకా అత్తపై కత్తితో దాడికి పాల్పడి తీవ్ర గాయాలుకలిగించాడు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియనగర్‌లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే… మహేష్ అనే వ్యక్తి, శ్రీదేవి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకొని కాబ్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య తరచూ మనస్పర్థలు, గొడవలు జరగుతున్నాయి. ఇదే కోపంతో మద్యం సేవించి ఇంటికి వచ్చిన మహేష్, భార్య శ్రీదేవి మరియు అత్తపై కత్తితో దాడికి దిగాడు.

ఇది కూడా చదవండి: Cyber Criminal Escape: ఢిల్లీలో తెలంగాణ పోలీసుల‌కు సైబ‌ర్ నేర‌గాడి బురిడీ

ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. శ్రీదేవి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నదని వైద్యులు తెలిపారు. కానీ ఆమె తల్లి మెడపై తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

పూర్తి సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కుటుంబ కలహాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *