Hyderabad:హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ మహమ్మారి పట్టి పీడిస్తున్నది. తరచూ ఏదో ఒక చోట డ్రగ్స్ అమ్మకాలు, వాడకాలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో తేలుతున్నది. తాజాగా శుక్రవారం పక్కా సమాచారంతో ఓ వైద్యుడి ఇంటిపై దాడి చేసి డ్రగ్స్‌ను గుర్తించిన ఘటన కలకలం రేపుతున్నది. పోలీసులు ప్రత్యేక నిఘాతో అక్కడక్కడా పట్టుబడుతున్నా..డ్రగ్స్ దందాకు మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad:హైదరాబాద్ చందానర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్మోహర్ పార్కులో నివాసముండే ఓ వైద్యుడి ఇంటిలో డ్రగ్స్ పార్టీకి ప్లాన్ చేసినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ఇంటిపై చందానగర్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో రూ.18 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకోగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్టు సమాచారం.
Hyderabad:ఈ డ్రగ్స్‌ను రాజస్థాన్ రాష్ట్రం నుంచి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో అమ్మకాలు, ఎవరెవరు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ అమ్మారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.