Nithin: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. నితిన్ కి జతగా శ్రీలీల నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ సంస్త నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రెండు పాటలు, కొద్ది పాటి షూటింగ్ మినహా సినిమా పూర్తయింది. ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ మూవీని డిసెంబర్ 20న విడుద చేయబోతున్నారు.
ఇది కూడా చదవండి: Rashmika Mandanna: ‘స్త్రీ2’ మేకర్స్ తో రశ్మిక హారర్ చిత్రం ‘ధామ’!
నిజానికి ఇది రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ డేట్. చరణ్ ఫ్యాన్స్ ను ఊరించిన ఈ డేట్ నుంచి మారి సంక్రాంతికి రాబోతోంది ‘గేమ్ ఛేంజర్’. దాంతో ఆ డేట్ కోసం పలు సినిమాలు పోటీ పడుతున్నాయి. నితిన్ ఆ డేట్ కే వచ్చేస్తున్నాడు. ఈ సినిమాకు జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. నవంబర్ మొదటి వారంలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. క్రిస్మస్ సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ కావటంతో సినిమాలకు అడ్వాంటేజ్ కానుంది. ఇటీవల కాలంలో నితిన్ సినిమాలు వరుసగా నిరాశపరుస్తూ వచ్చాయి. దాంతో అతని ఆశలన్నీ ‘రాబిన్ హుడ్’ పైనే ఉన్నాయి. మరి చరణ్ ‘గేమ్ ఛేంజర్’ డేట్ నితిన్ ‘రాబిన్ హుడ్’కి కలసి వస్తుందా? చూద్దాం ఏం జరుగుతుందో.