Charuhaasan:ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం తండ్రి, తమిళ సీనియర్ నటుడు చారుహాసన్ (93) అస్వస్థతకు గురయ్యారు. ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నారు. ఇదే విషయాన్ని సుహాసిని సోషల్ మీడియాలో వెల్లడించారు. చారుహాసన్ ప్రఖ్యాత సినీ నటుడు కమల్‌హాసన్‌కు సోదరుడు కూడా.
Charuhaasan:దీపావళికి ముందు మా తండ్రి చారుహాసన్ అస్వస్థతకు గురయ్యారు. మా పండుగ ఎమర్జెన్సీ వార్డులోనే గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు.. అంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తండ్రితో దిగిన ఫొటోను ఆమె పోస్టు చేశారు. చారుహాసన్ త్వరలో కోలుకోవాలని పలువురు తమిళ, తెలుగు నటీనటులతో పాటు వారి అభిమానులూ కోరుకుంటున్నారు.