Droupadi Murmu:

Droupadi Murmu: క‌రూర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ముర్ము ఏమ‌న్నారంటే..

Droupadi Murmu: న‌టుడు, టీవీకే పార్టీ అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌భ‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తంచేశారు. త‌మిళ‌నాడులోని క‌రూర్ జిల్లాలో జ‌రిగిన ఈ విషాద ఘ‌ట‌న గురించి తెలిసి తీవ్ర వేద‌న‌కు గురయ్యాన‌ని ఆమె పేర్కొన్నారు. తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తంచేశారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నా.. అని ముర్ము తెలిపారు.

Droupadi Murmu: త‌మిళ‌నాడు క‌రూర్‌లో జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. న‌టుడు, టీవీకే పార్టీ అధినేత విజ‌య్ నిర్వ‌హించిన ఓ స‌భ‌లో ఈ ఘోరం దుర్ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఈ ఘ‌ట‌న‌లో 39 మంది చ‌నిపోయారు. సుమారు 50 మంది వ‌ర‌కు తీవ్ర‌గాయాల‌తో చికిత్స పొందుతున్నారు. తోపులాట స‌మ‌యంలో కింద ప‌ట‌డంతో ఆ కొంద‌రి ప్రాణాలు పోయాయ‌ని సాక్షులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *