TS DOST Notification 2025: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త! డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) ప్రత్యేక విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు (శుక్రవారం, జూలై 25, 2025) నుంచి ప్రారంభమైంది. సీట్లు పొందాలనుకునే విద్యార్థులకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ఆచార్య బాలకిష్టారెడ్డి గురువారం షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ప్రకటించారు.
ముఖ్యమైన తేదీలు, వివరాలు:
రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల గడువు: ఈ నెల జూలై 25 నుంచి 31, 2025 వరకు.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: జూలై 31, 2025.
సీట్ల కేటాయింపు: ఆగస్టు 3, 2025న విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.
ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: ఆగస్టు 3 నుంచి 6, 2025 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
కళాశాలల్లో రిపోర్టింగ్: ఆగస్టు 4 నుంచి 6, 2025లోగా విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి.
స్పాట్ అడ్మిషన్లు: ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లోని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులలో ఆగస్టు 11, 12, 2025 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఈ స్పాట్ ప్రవేశాలలో స్థానికేతర విద్యార్థులు కూడా సీట్లు పొందవచ్చని ఛైర్మన్ బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Mandipalli Bros on Fire: ఆ మంత్రి వైల్డ్ ఫైర్.. వైసీపీ మాజీకి 33 సార్లు ఫోన్
ఇప్పటివరకు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోని విద్యార్థులు ఈ ప్రత్యేక విడతలో రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీట్లు కేటాయించడానికి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు. అయితే, కళాశాలల్లో సీసీవోటీపీ (CC OTP) ద్వారా తమ సీటును ఇప్పటికే ఖరారు చేసుకున్న విద్యార్థులు ఈ ప్రత్యేక విడతకు అర్హులు కారని దోస్త్ అధికారులు వివరించారు.
తాజాగా విడుదలైన దోస్త్ మొదటి దశ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 29న పూర్తయింది. ఈ మొదటి విడతలో మొత్తం 89,572 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, వారిలో 65,191 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. ఇందులో 60,436 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పుడు రెండో విడత రిజిస్ట్రేషన్లు కూడా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రారంభమయ్యాయి.

