Hyderabad: భారతదేశంలోనే అత్యంత పొడవైన ఫ్లైఓవర్ ఎక్కడో మీకు తెలుసా? ప్రతిష్ఠాత్మక మెట్రో సిటీలను మించేలా ఆ ఫ్లైఓవర్ నిర్మించింది ఎక్కడని మీరనుకుంటున్నారు. ఆ ఘనత మన తెలుగు రాష్ట్రాలకే దక్కిందండోయ్. అది ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాద్ మహా నగరానికే ఆ ఘనత దక్కడం విశేషం. అదే విశ్వేశ్వరయ్య ఫ్లైఓవర్ నిర్మాణం. అది హైదరాబాద్‌లోని మెహదీపట్నం నుంచి బెంగళూరు హైవే పైన ఉన్న ఆరాంఘర్ వరకు ఈ భారీ ఫ్లైఓవర్ నిర్మాణం ఉన్నది. దీని పొడవు 11.6 కిలోమీటర్లు అన్నమాట. ఇది మనదేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్‌గా గుర్తించారు.
