Hug Benefits: ప్రేమతో ఇచ్చే హగ్‌కు ఎలాంటి కోపాన్ని అయినా తగ్గించే శక్తి ఉంది. కౌగిలింతకు వేర్వేరు పరిస్థితులలో వేర్వేరు అర్థాలు ఉంటాయి. మనం ప్రేమించే వ్యక్తిని కౌగిలించుకోవడం వల్ల శరీరానికి, మనసుకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని పలు అధ్యాయనాల్లో తేలింది. ఒకరిని కేవలం 20 సెకన్ల పాటు గట్టిగా కౌగిలించుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి కౌగిలించుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒత్తిడి – ఆందోళనను తగ్గిస్తుంది: ఈ రోజుల్లో పని ఒత్తిడి, భయాందోళనలు, మనశ్శాంతి కోల్పోవడం సహజం. కానీ ప్రియమైన వ్యక్తిని కేవలం 20 సెకన్ల పాటు కౌగిలించుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు, శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది మనశ్శాంతిని అందించడం ద్వారా ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.
మానసిక ఆరోగ్యం: భాగస్వామిని లేదా మనం ప్రేమించే వారిని కౌగిలించుకోవడం వల్ల మన మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా గుండె ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. కౌగిలింతలు మనస్సును ప్రశాంతపరుస్తాయి. ఆనందాన్ని పెంచే హార్మోన్లను విడుదల చేస్తాయి.
నొప్పి నుంచి రిలీఫ్ : కౌగిలించుకోవడం ఒక మంచి అనుభూతి మాత్రమే కాదు.. శరీరానికి కూడా మంచిది. కౌగిలింతకు శరీరంలోని నొప్పిని తగ్గించే శక్తి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు చాలా శక్తివంతమైనవి, కొన్ని చికిత్సల కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Coolie Movie: సూపర్ స్టార్ సినిమాలో పూజా హెగ్డే ఐటమ్ స్టెప్పులు!
గుండె ఆరోగ్యం: నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ప్రేమపూర్వక కౌగిలింత రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అప్పుడే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కొన్ని అధ్యయనాల్లో రోజుకు ఒక్కసారైనా హగ్ చేసుకోని జంటల హృదయ స్పందన రేటు నిమిషానికి 10 బీట్స్ పెరుగుతుందని తేలింది. దీని అర్థం కౌగిలించుకోని వారి ఒత్తిడి స్థాయిలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, మనం ప్రేమించే వ్యక్తిని కౌగిలించుకోవడం వల్ల శరీరానికి, మనసుకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుతుంది.
ప్రతిరోజూ మన ప్రియమైన వారిని కౌగిలించుకోవడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కొంతమంది హగ్ ఇవ్వడాన్ని విస్మరిస్తారు. కానీ ఈ చిన్న ప్రయత్నం మీ ఆరోగ్యంలో అనేక మార్పులకు దారితీస్తుందని ఎప్పటికీ మర్చిపోకండి.