Disha Patani: ప్రభాస్ ‘కల్కి’తర్వాత దిశాపటాని సూర్యతో కలసి ‘కంగువ’లో నటించింది. ‘కల్కి’లో తక్కువ స్క్రీన్ స్పేస్ తో నిరాశపడ్డ దిశాకు ‘కంగువ’లోనూ అదే అనుభవం ఎదురు కానున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ తో కలసి యువీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాబీడియోల్ విలన్ గా నటించిన ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. నవంబరు 14న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమాలో నటించిన అనుభవాలను మీడియాతో షేర్ చేసుకుంది దిశాపటాని.
Disha Patani: తను నటించిన ‘కల్కి, కంగువ’ లార్జర్ దేన్ లైఫ్’ సినిమాలని చెప్పిన దిశాపటాని రెండు సినిమాలు కె అక్షరంతో ఆరంభం కావటంతో కె తన లక్కీ లెటర్ అయిందన్నారు. తాజాగా ఈ సినిమాలోంచి విడుదలై ఇన్ స్టెంట్ హిట్ గా నిలిచిన ‘యోలో’ పాటలో సూర్యతో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుందంటూ నాలుగు రోజుల పాటు లెక్కలేనన్ని లొకేషన్స్ లో 21 కాస్ట్యూమ్స్ ఛేంజెస్ తో నటించటం మర్చిపోలేని అనుభూతిగా వర్ణించింది దిశా. మరి ఇంత కష్టపడ్డ దిశాకు తగిన ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి.

