Manohar Chimmani: ”కల, అలా, వెల్కమ్, స్విమ్మింగ్ ఫూల్’ వంటి చిత్రాలను రూపొందించిన చిమ్మని మనోహర్ మరోసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు యూత్ ఫుల్ లవ్ ఎంటర్ గా ‘యో! 10 ప్రేమకథలు’ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు. మంచి రచయిత కూడా అయిన చిమ్మని మనోహర్ రాసిన ‘సినిమా స్క్రిప్ట్ రచనా శిల్పం’ పుస్తకం అప్పట్లో నంది పురస్కారాన్ని పొందింది. ‘యో! 10 ప్రేమకథలు’ గురించి చిమ్మని మనోహర్ మాట్లాడుతూ, ”రెండు గంటల నిడివితో సాగే ఈ చిత్రంలో పది ప్రేమకథలు ఉంటాయని, ఒక్కే ప్రేమకథ ఒక్కో జాన్ లో ఉంటుందని, ఈ ప్రేమకథలన్నింటి లక్ష్యం ఒక్కటేనని చెప్పారు. అన్ని వయసుల వారికీ కనెక్ట్ అయ్యే ఈ సినిమాలో పదిమంది పాపులర్ హీరోహీరోయిన్లు నటిస్తున్నారని తెలిపారు. నవంబర్ చివరి వారంలో సెట్స్ పైకి వెళ్ళే ఈ చిత్రాన్ని పి సి క్రియేషన్స్ సమర్పణలో, మనూటైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర ప్రారంభోత్సవంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ తో పాటు చంద్రమహేశ్, బాబ్జీ, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
