Naga Babu: మెగాస్టార్’కు తమ్ముడు- పవర్ స్టార్ కు ‘అన్నయ్య’ అయిన నాగబాబు నటనిర్మాతగా తనదైన పంథాలో పయనించారు. కొన్ని టీవీ షోస్ లో జడ్జ్ గానూ వ్యవహరించారు. ఆయన తనయుడు వరుణ్ తేజ్, కూతురు నిహారిక సైతం నటనలో అడుగుపెట్టారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలను పోషిస్తూ సాగుతున్న నాగబాబు అక్టోబర్ 29న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ‘రాక్షసుడు’ చిత్రంతో తెరపై తొలిసారి కనిపించిన నాగబాబు తరువాత హీరోగానూ కొన్ని చిత్రాల్లో అలరించారు. ఆ తరువాత కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్నారు. అన్న చిరంజీవి నెలకొల్పిన ‘ప్రజారాజ్యం’ పార్టీ తరపున ప్రచారం చేశారు. తమ్ముడు పవన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీ టిక్కెట్ పై నరసాపురం ఎంపీగా 2019లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. తరువాత పార్టీలో కొనసాగుతూ, స్పోక్స్ పర్సన్ గా ఉన్నారే తప్ప 2024లో పోటీ చేయలేదు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠిని వివాహమాడారు. అలా నాగబాబు కుటుంబంలో యాక్టర్స్ సంఖ్య పెరిగింది. నాగబాబు మునుముందు కూడా తన చెంతకు చేరిన పాత్రలతో అలరిస్తారని ఆశిద్దాం.
