Dil Raju

Dil Raju: కేటీఆర్‌ ఇక ఆపితే మంచిదంటోన్న దిల్‌ రాజు!

Dil Raju: దిల్‌రాజును బీఆర్‌ఎస్‌ నేతలు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణం సినీ ప్రముఖులతో సీఎం రేవంత్‌ భేటీపై కేటీఆర్‌ కామెంట్లకు దిల్‌ రాజు సమాధానం చెప్పటమే… సినీ ప్రముఖులతో రేవంత్‌ రెడ్డి చాటుమాటు వ్యవహారాలకు
దిల్‌రాజు తోడ్పాటందించారన్న కేటీఆర్‌ కామెంట్లకు దిల్‌రాజు ధీటుగానే సమాధానం చెప్పారు. రాజకీయ వివాదాల్లోకి సినీ పరిశ్రమను లాగొద్దన్నారు. రేవంత్‌ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ చాటు మాటు వ్యవహారం కాదని, అందరికీ తెలిసే జరిగిందని దిల్‌ రాజు సమాధానం ఇచ్చారు.

Dil Raju: కేటీఆర్‌కు దిల్‌ రాజు గట్టిగా సమాధానం ఇవ్వడాన్ని బీఆర్ఎస్‌ నేతలు తట్టుకోలేకపోతున్నారా… అందుకే దిల్‌రాజును పదే పదే టార్గెట్‌ చేస్తున్నారు.కేటీఆర్‌ ఆరోపణలకు స్పందించిన దిల్‌రాజు గతంలో ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నిస్తున్నారు. దిల్‌రాజును ఇపుడు డీల్‌ రాజు అంటే బీఆర్‌ఎస్‌ నేతలు ఏకంగా పేరు పెట్టేశారు. నాగార్జున-సమంత ఎపిసోడ్‌లో కొండా సురేఖ ఆరోపణలపై ఎందుకు స్పందించలేదంటూ దిల్‌ రాజును ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా దిల్‌రాజు సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గర మార్కుల కోసం డీల్‌ రాజు అయిపోయారని విమర్శిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: గుడ్ న్యూస్.. రైతు భరోసాకు లైన్ క్లియర్..

Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎవరున్నా ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి వారధిగా పని చేయాల్సిందే.ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ను ఎంపిక చేసేపుడే ఇద్దరితో దగ్గర సంబంధాలుండే వ్యక్తినే నియమిస్తారు. ఏదన్నా సమస్య వచ్చినపుడు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించడం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ బాద్యత… పుష్ప ఎపిసోడ్‌లో సంధ్య థియేటర్‌ ఎపిసోడ్‌ సినీరంగంలో ఎంతటి ప్రకంపనాలు సృష్టించిందో అందరికీ తెలుసు… చివరకు హీరో అల్లు అర్జున్‌ అరెస్టుకు ఈ సంఘటన దారితీసింది. ఇదే సమయంలో సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రీమియర్‌, బెనిఫిట్‌ షోలకు అనుమతి లేదు, టిక్కెట్ల రేటు పెంచేదే లేదని ప్రకటించారు.

Dil Raju: బెనిఫిట్‌ షోలు, ప్రీమియర్‌లకు అనుమతి లేకపోతే నిర్మాతలు నిండా మునిగిపోతారు. అందుకే సినీ ప్రముఖులు దిల్‌రాజుతో కలిసి చర్చించారు. సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ ఏర్పాటు చెయ్యాలని కోరారు. వారి మాట ప్రకారమే దిల్‌రాజు సీఎంతో మాట్లాడి భేటీ ఏర్పాటు చేశారు. కానీ భేటీలో వారు ఆశించినట్లుగా రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించలేదు. భేటీ ప్రారంభంలోనే రేవంత్‌ రెడ్డి బెనిఫిట్‌ షోలు, టిక్కెట్ల పెంపు అడగొద్దంటూ తేల్చిచెప్పారు. దీంతో ఏం మాట్లాడాలో తెలియక సినీ ప్రముఖులు భేటీని ముగించేశారు.

ALSO READ  Komatireddy Venkatreddy : రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకి లేదు

ఇది కూడా చదవండి: Sensor Board: ఆ టైటిల్ పై సెన్సార్ అభ్యంతరం!

Dil Raju: అయితే ఇక్కడే కేటీఆర్‌కు మండిపోయింది. అల్లు అర్జున్‌ అరెస్టు, సినీ ఫీల్డ్‌ టార్గెట్, రేట్లు పెంచమనడంపై సినీ ప్రముఖులు సీఎంను నిలదీస్తారని భావించారు. ఒకవేళ అక్కడ నిలదియ్యకపోయిన బయటకు వచ్చైనా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారని భావించారు. అలా జరగలేదు. అందునా బుల్డోజర్లు దిగిన నాగార్జున లాంటి స్టార్లు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. తాము ఎవరి కోసమైతే నిలబడ్డామో వారంతా భేటీకి వెళ్లి మరీ సీఎంకు శాలువాలు కప్పారు. సీఎంకు మద్ధతుగా మాట్లాడారు.

Dil Raju:  ఇది కేటీఆర్ జీర్ణించుకోలేపోతున్నారు. కొండా సురేఖ ఎపిసోడ్‌లో నాగార్జున కుటుంబానికి సంఘీభావం తెలపడమే కాదు. ఆ తరువాత అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌లో ప్రభుత్వాన్ని సినీ ఫీల్డ్‌ కంటే ఎక్కువ నిలదీసింది బీఆర్‌ఎస్సే… భేటీ తరువాత సినీ ప్రముఖుల వైఖరి చూసి తమ పోరాటానికి ఫలితం లేదని బీఆర్‌ఎస్‌ కుమిలిపోతుందా… అందునే కేటీఆర్‌ మరింత ఆవేదన చెందుతున్నారా. ఇంతటి ఘోరానికి కారణమైన దిల్‌ రాజును అందుకే టార్గెట్ చేస్తున్నారా… ఇందులో కొసమెరుపు ఏంటంటే కొండా సురేఖ ఎపిసోడ్‌లో దిల్‌ రాజు కూడా స్పందించారు. మంత్రిని తప్పుపట్టారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *