Ravi Teja: మాస్ మహరాజా రవితేజ – దర్శకుడు పూరి జగన్నాథ్ లది సూపర్ హిట్ కాంబినేషన్. అయితే… వారిద్దరి కాంబిలో వచ్చిన ‘నేనింతే’ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆడలేదు. సినిమా కష్టాలను తెలియచేసే ఈ సినిమా నంది అవార్డులను మాత్రం బాగానే అందుకుంది. రవితేజాకు ఉత్తమ నటుడిగా, పూరికి ఉత్తమ మాటల రచయితగా, రామ్ లక్ష్మణ్ లకు ఉత్తమ ఫైట్ మాస్టర్స్ గా అవార్డ్ ను అందించింది.
ఇది కూడా చదవండి: Hyderabad: గుడ్ న్యూస్.. రైతు భరోసాకు లైన్ క్లియర్..
Ravi Teja: డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు చక్రి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఈమూవీ విడుదలై దాదాపు 16 సంవత్సరాలవుతోంది. ఈ యేడాది రవితేజ బర్త్ డే కానుకగా జనవరి 26న రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. ఈ సినిమాతో శియా గౌతమ్ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
కొరియన్ వెబ్ సీరిస్ లో డికాప్రియో!
Leonardo DiCaprio: ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో ఏం చేసినా భిన్నంగా ఉంటుంది. ‘టైటానిక్’ చిత్రంతో భారతీయుల మదిని సైతం కొల్లగొట్టిన డికాప్రియో ఇప్పుడు కొరియన్ వెబ్ సీరిస్ లో మెరియబోతున్నాడు. సర్వైవల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ‘స్క్విడ్ గేమ్’ రెండు భాగాలుగా వచ్చి, ప్రపంచ ప్రేక్షుకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ వెబ్ సీరిస్ మూడో భాగం చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే సగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇందులో డికాప్రియో అతిథి పాత్రను పోషిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ యేడాది వేసవి కాలంలో ఈ మూడో భాగం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.