Sensor Board: రామ్ చరణ్, శంకర్ కాంబోలో ‘దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ ఈ నెల 10న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ దీనిని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సెన్సార్ సర్టిఫికెట్ ను నిర్మాతలు పొందారు. ఆ మధ్య సినిమా ఏ భాషలో రూపుదిద్దుకుంటే ఆ భాషలో నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు ఉండాలని సెన్సార్ వారు నిబంధన విధించారు. అలానే సినిమా టైటిల్ కూడా ఖచ్చితంగా అదే భాషలో ఉండాలనే రూల్ కూడా ఉంది.
ఇది కూడా చదవండి: Lover Boy: చార్ మినార్ కాదు ‘పాంచ్ మినార్’ అంటున్న లవర్ బోయ్
Sensor Board: అందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ ను ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ పెట్టాలని సెన్సార్ వారు నిర్మాతలకు ఆదేశాలు జారీ చేశారట. ఇక ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకర పదాలను వేరే పదాలతో రీప్లేస్ చేయమని చిత్ర బృందాన్ని కోరారట. అలానే పద్మశ్రీ అనే పురస్కారాన్ని ఓ బిరుదుగా వాడుకోకూడదనే నిబంధన కూడా ఉంది. ఈ సినిమా టైటిల్స్ కార్డులో బ్రహ్మానందం పేరు ముందున్న పద్మశ్రీ ని తొలగించమన్నారట. వీటిని నిర్మాతలు మార్చడంతో ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా రన్ టైమ్ మొన్న దిల్ రాజు చెప్పినట్టు రెండు గంటల నలభై ఐదు నిమిషాల 30 సెకన్లకు లాక్ చేశారు.