Rangareddy: రంగారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. జిల్లేడ్ చౌదరిగూడ మండలంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లాల్‌పహాడ్ నుండి చౌదరిగూడ మండలానికి వెళ్తున్న ఆటో తుమ్మలపల్లి గేటు వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జంగయ్య అనే వ్యక్తిపై ఆటో పడటంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
ఆటోలో ప్రయాణిస్తున్న మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.