బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మాటలను చాలా మిస్సవుతున్నట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో ఆయన పులిలా ఉన్నారని, కానీ ఇప్పుడు పిల్లిలాగా అయ్యారని విమర్శలు చేశారు. కేసీఆర్.. తెలంగాణను నట్టేట ముంచారని చెప్పారు.
కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసిందని ఫైరయ్యారు. రైతులకు అండగా నిలిచేందుకు బీజేఎల్పీ నేతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్షను సోమవారం చేపట్టారని అందులో పాల్గొంటానని చెప్పారు.
హైదరాబాద్‌లో సీట్లు రాలేదని, వాళ్లకు గ్రామీణ ప్రాంతాల ఓట్లు వచ్చాయని, అందుకే గ్రేటర్ పరిధిలో పేదల ఇండ్లు కూలుస్తోందని విమర్శించారు.