Raghuvaran Btech

Raghuvaran Btech: మరో సారి వస్తున్న రఘువరన్ బీటెక్.. ఎప్పుడంటే ?

Raghuvaran Btech: ధనుష్ హీరోగా పదేళ్ళ క్రితం తెరకెక్కిన చిత్రం ‘వేళై ఇళ్ళా పట్టాధారి’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో ‘రఘువరన్ బిటెక్’ పేరుతో రిలీజ్ చేసింది స్రవంతి మూవీస్ సంస్థ. పదేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అద్భుతమైన సక్సెస్ ను చవిచూసింది. వేల్ రాజ్ దర్శకత్వంలో్ తెరకెక్కిన ఈ చిత్రంలో అమలాపాల్, శరణ్య, సముతిర ఖని, వివేక్, విఘ్నేశ్ శివన్, సురభి ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ఎంతో ప్లస్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను జనవరి 4వ తేదీన రీరీలీజ్ చేయబోతున్నట్లు స్రవంతి మూవీస్ సంస్థ ప్రకటించింది. పదేళ్ళ క్రితం థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాకు ఓటీటీలోనూ చక్కటి వీక్షణ లభించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లలో యువత బాగా సెలబ్రేట్ చేసుకుంటుందని స్రవంతి మూవీస్ నమ్ముతోంది. మరి వారి నమ్మకాన్ని ఈ రీరిలీజ్ ద్వారా ‘రఘువరన్’ ఎంత వరకు నెలబెడతాడో చూద్దాం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *