Dhanush : స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ‘కుబేర’, ‘ఇడ్లీ కడాయ్’ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తన కొత్త ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా అనౌన్స్ చేశారు. ప్రముఖ డైరెక్టర్ మారి సెల్వరాజ్ రూపొందిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె గణేష్ నిర్మిస్తున్నారు.
‘త్వరలో ఓ మహా యుద్ధం మొదలు కానుంది’ అంటూ విడుదలైన పవర్ఫుల్ పోస్టర్ సినీ ప్రియుల్లో హైప్‌ను పెంచేసింది. గతంలో ‘కర్ణన్’ సినిమాతో సామాజిక సమస్యలను చురకలు వేసేలా చూపించిన మారి సెల్వరాజ్, ఈసారి ఎలాంటి కథాంశంతో ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేయనున్నాడనే ఆసక్తి రేగుతోంది. ధనుష్ ఈ మూవీలో ఎలాంటి రోల్లో కనిపిస్తాడు?
Also Read: Hit 3: రెండో పాటలో సూపర్ సర్ప్రైజ్!
Dhanush : ఈ ‘యుద్ధం’ ఏ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది? అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మరి, ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. పూర్తి వివరాల కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ధనుష్ అభిమానులకు ఈ సినిమా మరో బిగ్ ట్రీట్ అవుతుందనడంలో సందేహం లేదు.

