Dhanush – Mrunal Thakur: కోలీవుడ్ స్టార్ ధనుష్, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ల మధ్య సమ్ థింగ్, సమ్ థింగ్ అంటూ వస్తున్న వార్తలు నిజమేనా?.. ఫైర్ లేనిదే స్మోక్ రాదు కదా.. ఇవిగో పక్కా ప్రూఫ్స్.. భలే దొరికిపోయారు అంటూ నెట్టింట క్రేజీ న్యూస్, పిక్స్ వైరల్ అవుతున్నాయి. అవన్నీ చూస్తే, నిజమే అనుకునేలా ఉంది వీరి వ్యవహారం.. అసలేం జరిగిందో చూసేద్దాం..
అజయ్ దేవ్ గణ్ తో మృణాల్ చేసిన సన్నాఫ్ సర్దార్ 2 ప్రీమియర్ జూలై 1న జరిగింది. దీనికి ధనుష్ వచ్చాడు. తర్వాత జరిగిన మృణాల్ బర్త్ డే సెలబ్రేషన్స్ లోనూ ధనుష్, మృణాల్ తో క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపించాడు. అలాగే ధనుష్ సిస్టర్స్.. కార్తీక, విమల గీతలను మృణాల్ కలిసినట్లు న్యూస్ వచ్చింది. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ మృణాల్ ను, ఆమె.. వీళ్లను ఫాలో అవుతున్నారు. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి అని రకరకాల వార్తలు వస్తున్నా.. ధనుష్, మృణాల్ వీటి గురించి రియాక్ట్ కాలేదు.