Dhanush: నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబం సినిమాతో తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేశాడు ధనుష్. ఈ సినిమా తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా పేరుతో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి ధనుష్ కేవలం దర్శకుడుగా మాత్రమే కాదు నిర్మాతగా కూడా రిస్క్ చేశాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయింది.
ఈ మూవీని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ రిలీజ్ చేయగా తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన పా పాండి, రాయన్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మేనల్లుడితో చేసిన మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇది కూడా చదవండి: Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ సెకండ్ సాంగ్ టైమ్ ఫిక్స్!
ముఖ్యంగా ఇందులోని కామెడి యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ హిట్ తో డైరెక్టర్ గా ధనుష్ హ్యాట్రిక్ హిట్ కొట్టేసాడు. ఇక ధనుష్ డైరెక్షన్ లో వస్తున్న’ఇడ్లీ కడాయ్’ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. ఇటు దర్శకుడిగా అటు హీరోగా ఇంకా నిర్మాతగా ధనుష్ సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తున్నాడు.
జాబిలమ్మ నీకు అంతా కోపమా ట్రైలర్ | ధనుష్ | పవిష్ | అనిఖా | ప్రియా వారియర్ | జివి ప్రకాష్ :