Nayanthara: ఇటీవల టాక్ ఆఫ్ ద సౌత్ సినిమా ఇండస్ట్రీగా మారిన నయనతార, ధనుష్ వివాదం ఇక్కడితో ఆగేటట్లు కనిపించటం లేదు. నయన్ కు ధనుష్ మరో షాక్ ఇచ్చాడట. నయనతార పుట్టినరోజున నెట్ ఫ్లిక్స్ ‘నయనతార బియాండ్ ది పెయిరీ టేల్’ డాక్యుమెంటరీని రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంటరీలో 37 సెకండ్స్ ‘నానుమ్ రౌడీదాన్’ విజువల్స్ వాడారు. ఆ పుటేజ్ ని 24 గంటల్లో తొలిగించాలని ధనుష్ నయన్ దంపతులకు అల్టిమేటం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు లాయర్ వారికి నోటీసు పంపుతూ ‘నా క్లయింట్ సినిమాలోని కంటెంట్ ను డాక్యుమెంటరీ ఉపయోగించటం ద్వారా కాపీరైట్ చట్టాన్ఇన ఉల్లంఘించారు. దానిని 24 గంటల్లో తీసివేయాలని కోరుతున్నాం. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది. కేవలం పది కోట్లు మాత్రమే కాదు మరింత నష్టపరిహారాన్ని మీ కంపెనీ కానీ, నెట్ ప్లిక్స్ కానీ చెల్లించవలసి ఉంటుంది’ అని హెచ్చిరించినట్లు తెలియవస్తోంది.
Nayanthara: నయన్ ఓపెన్ లెటర్ ను కూడా ప్రస్తావిస్తూ ‘నా క్లయింట్ సినిమాకు నిర్మాత. తెరవెనుక పుటేజిని చిత్రీకరించటానికి ఎవరినీ నియమించలేదు. మీరు చేసిన ఆరోపణలు అవాస్తవం’ అని ధనుష్ లాయర్లు చెబుతున్నారు. ధనుష్ నోటీస్ తర్వాత ఎడిట్ చేసిన 3 సెకన్ల వీడియోను నయన్ డిలీట్ చేసినట్లు చెప్పినా నెట్ ప్లిక్స్ లో 37 సెకన్ల వీడియో క్లిప్పింగ్ వాడినట్లు తెలియవచ్చింది. ఈ విషయంలో నయన్ కు మద్దతుగా ధనుష్ హీరోయిన్స్ కూడా నిలిచినప్పటికీ డాక్యుమెంటరీ హైప్ కోసమే నయన్ ధనుఫై ఆరోపణలు చేసిందేమో అనే వారు కూడా లేకపోలేదు. ఈ వివాదంపై దనుష్ నేరుగా స్పందించకున్నా లీగల్ గా చర్యలు తీసుకుంటున్నాడు. మరి ఈ వివాదం చివరికి ఎక్కడ ముగుస్తుందో చూడాలి.
EXPECTING A STRICT ACTION FROM WUNDERBAR
How did #Nayanthara and #VigneshShivan use NRD clips in the documentary that was sold to @NetflixIndia for a hefty sum without receiving a NOC from @wunderbarfilms ? 🤔
— Let’s X OTT GLOBAL (@LetsXOtt) November 18, 2024