Devara OST

Devara OST: దేవర OST రిలీజ్.. ఫ్యాన్స్‌కు నిరాశే!

Devara OST: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన ‘దేవర: పార్ట్ 1’ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేసింది. రిలీజ్ నాటి నుంచి సంచలన వసూళ్లతో ఎన్టీఆర్ కెరీర్‌లోనే టాప్ గ్రాసర్‌గా నిలిచిన ఈ చిత్రం, జపాన్‌లోనూ విడుదలై అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది. ఆయన అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయని అంతా మెచ్చుకున్నారు. ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర OST’ని మేకర్స్ రిలీజ్ చేశారు.

Also Read: Jailer 2: ఫుల్ స్వింగ్ లో ‘జైలర్ 2’!

Devara OST: మొత్తం 16 ట్రాక్స్‌తో విడుదలైన ఈ ఒరిజినల్ సౌండ్‌ట్రాక్ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. అయితే, థియేటర్స్‌లో బాగా ఆకట్టుకున్న కొన్ని హిట్ ట్రాక్స్ ఈ OSTలో మిస్ కావడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. అయినప్పటికీ, అనిరుద్ మ్యాజిక్ మరోసారి సంగీత ప్రియులను అలరిస్తోంది. మరిన్ని ట్రాక్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దేవర’ మరోసారి తన సత్తా చాటుతోంది!

దేవర పార్ట్ 1 (ఒరిజినల్ సౌండ్‌ట్రాక్) OST జ్యూక్‌బాక్స్ ఇక్కడ చూడండీ : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *