Delhi: ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ కార్యాలయంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు, అందులో ఆమెను సీఎల్పీ నేతగా ఎంపిక చేశారు. రేఖా గుప్తా గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో 48 చోట్ల విజయం సాధించింది, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకు పరిమితమైంది. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం ఓడిపోయారు.
చాలా సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రాగా, ముఖ్యమంత్రి పదవి కోసం కీలక నేతలు పోటీపడ్డారు. పర్వేష్ వర్మ, జితేంద్ర మహాజన్ వంటి నేతలు ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. చివరకు సామాజిక సమీకరణలు, ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న బినోయ్ సామాజిక వర్గానికి చెందిన రేఖా గుప్తా వైపు అధిష్టానం మొగ్గు చూపింది. డిప్యూటీ సీఎంగా పర్వేష్ వర్మ, అసెంబ్లీ స్పీకర్గా విజేంద్ర గుప్తాను ఎన్నుకోనున్నట్లు సమాచారం.

