Delhi: ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు సమావేశమై, NDA తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
వైవీ సుబ్బారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి గందరగోళం లేకుండా పార్టీ సభ్యులంతా ఒకే తీరు పాటించేందుకు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు.
అసెంబ్లీ, లోక్‌సభ, రాజ్యసభలో వైసీపీకి గణనీయమైన బలం ఉన్నందున, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి అనుకూలంగా ఓట్లు పడతాయని స్పష్టమైంది. దీంతో అధికారపార్టీ వైఖరి మరోసారి చర్చనీయాంశమైంది.