Delhi: పాకిస్థాన్ మరోసారి ఉగ్రదాడికి ప్రయత్నించే అవకాశం ఉందని వెస్టర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ హెచ్చరించారు. జమ్ము కశ్మీర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ పహల్గామ్ తరహాలో మరో దాడి చేసేందుకు యత్నిస్తే భారత్ నుండి తీవ్ర ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేశారు.
> “ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇప్పటికే పాకిస్థాన్ దుశ్చర్యలకు గట్టిగా బదులిచ్చాం. అయినప్పటికీ, ఆ దేశం తన వైఖరిని మార్చకోవడం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించార
మనోజ్ కుమార్ తెలిపారు — పాకిస్థాన్ ప్రతి కదలికను భారత సైన్యం దగ్గరగా గమనిస్తోందని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే భారత్ ఇచ్చే సమాధానం మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించ
పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్
గత ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో ఉగ్రదాడి జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత సైన్యం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడిలో పలు ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి.
భారత్ గట్టి హెచ్చరిక
పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ఈసారి గుణపాఠం తీవ్రంగా ఉంటుందనే సంకేతాలను భారత సైన్యం ఇప్పటికే ఇచ్చిందని మనోజ్ కుమార్ గుర్తు చేశారు.
> “మా సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. కానీ, పాకిస్థాన్ దుందుడుకు చర్యలకు పాల్పడితే ఈసారి ఇచ్చే సమాధానం మునుపెన్నడూ లేనంత కఠినంగా ఉంటుంది,” అని ఆయన స్పష్టం చేశారు.