Delhi High Court

Delhi High Court: ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల పిటిషన్.. నోటీసులు ఇచ్చిన హైకోర్టు

Delhi High Court: బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన  పిటిషన్‌పై ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్, కాగ్, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై హైకోర్టు డిసెంబర్ 9న తదుపరి విచారణ చేపట్టనుంది.

ఇది కూడా చదవండి: Lawrence Bishnoi: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి కీలక పదవి.. ఎక్కడంటే..

కాగ్ నివేదికలను ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి అతిషి వద్ద పెండింగ్ లో ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆ నివేదికలను లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపాల్సి ఉన్నప్పటికీ పంపలేదని బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టులో పిటిషన్ వేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కోరినప్పటికీ, ఆ రిపోర్టులు పంపించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. 12 కాగ్ నివేదికలను లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపాలని.. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కోర్టును బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు.ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా సహా 7 మంది బీజేపీ ఎమ్మెల్యేల తరఫున ఢిల్లీ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Arvind Kejriwal: ఆప్‌ ఓడిపోతే.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు మూతపడతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *