Andhra pradesh: 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఏపీ సర్కార్ తాజాగా కరవు మండలాల జాబితాను విడుదల చేసింది. ఐదు జిల్లాల్లోని 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తించింది. వీటిని నోటిఫై చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోడియా ఆదేశాలు జారీ చేశారు. మిగతా 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్టుగా రిపోర్టులు వచ్చినట్లు వెల్లడించింది.
Andhra Pradesh: ఇక 54 మండలాల్లో 27 చోట్ల తీవ్రమైన, మరో 27 మండలాల్లో మధ్యస్థంగా కరవు పరిస్థితులు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అనంతపురం, అన్నమయ్య, కర్నులు, సత్యసాయి, చిత్తూరు జిల్లాలోని 54 మండలాలు కరవు బారిన పడినట్టు సర్కార్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
2024 ఖరీఫ్‌లో 93.55 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు.
అనంతపురం జిల్లా నార్పల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల, అన్నమయ్య జిల్లా గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, టి.సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, చిత్తూరు జిల్లా పెనుమూర్, యాదమర్రి, గుడిపాలను తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు.
కర్నూలు జిల్లా కౌతాళం, పెద్ద కడుబూరు, అనంతపురం జిల్లా విడపనకల్, యాడికి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి, ధర్మవరం, నంబులపులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి, చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు.
ఏపీలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 114.72 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా.. 82 శాతం విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు.