Delhi:

Delhi: ఆ వాహ‌నాల‌కు బంకుల్లో ఇంధ‌నం బంద్‌.. ఏప్రిల్ 1 నుంచే అమ‌లు

Delhi: కాలం చెల్లిన వాహ‌నాల‌కు ఇక పెట్రోల్ బంకుల్లో ఇంధ‌నం పోయొద్ద‌ని కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది వ‌చ్చే నెల ఏప్రిల్ 1 నుంచి అమ‌లులోకి వ‌స్తుంది. కాలుష్య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. దీంతో 15 ఏళ్లు పైబ‌డిన వాహ‌నాలు ఇక మూల‌న ప‌డేయాల్సిందేన‌న్నమాట‌. ఇది ఎక్క‌డ‌నుకుంటున్నారు. దేశ రాజ‌ధాని న‌గ‌ర‌మైన ఢిల్లీలో అమ‌లుకానున్న‌ది.

Delhi: ఇటీవ‌లే ఢిల్లీలో కొలువుదీరిన బీజేపీ కొత్త ప్ర‌భుత్వం ఈ కీల‌క నిర్ణ‌యాన్ని తాజాగా ప్ర‌క‌టించింది. ఆ రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి మంజింద‌ర్‌సింగ్ సిర్సాతో ఈ మేర‌కు అధికారులు భేటీ అయ్యారు. 15 ఏళ్లు పైబ‌డిన వాహ‌నాల‌కు మార్చి 31 త‌ర్వాత బంకుల్లో ఇంధ‌నం పోయ‌కుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న ఆదేశాలు జారీ చేశారు.

Delhi: ఢిల్లీలో కాలుష్య క‌ట్ట‌డికి కంక‌ణ‌బ‌ద్ధులై ఉన్నాం. 15 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వాహ‌నాల‌ను గుర్తించ‌డానికి పెట్రోల్ బంకుల్లో గాడ్జెట్లు ఏర్పాటు చేస్తాం. గ‌డువు దాటిన వాహ‌నాల‌ను అవి గుర్తిస్తాయి. వాటికి పెట్రోల్‌, డీజీల్ పోయొద్దు. ఈ ఆంక్ష‌ల‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్ర పెట్రోలియం శాఖ‌కు పంపిస్తాం.. అని ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి మంజింద‌ర్‌సింగ్ సిర్సా వివ‌రించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Delhi: న్యూఢిల్లీ తొక్కిసలాట పై స్పందించిన రైల్వే శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *