Delhi: యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా లాగా రొమాంటిక్ కాదు జనరల్ మనోజ్ నరవణే

Delhi: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదరిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంపై కొందరు విమర్శలు చేస్తుండగా, భారత సైన్యానికి మాజీ చీఫ్‌గా సేవలందించిన జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు.

“యుద్ధం అనేది బాలీవుడ్ సినిమాల లాగా రొమాంటిక్‌గా ఉండదు. అది చాలా తీవ్రమైన విషయం. యుద్ధం వల్ల చాలా కుటుంబాలు తమ బంధువులను కోల్పోతాయి. ఈ వేదన తరం తరాల పాటు వెంటాడుతుంది,” అని ఆయన అన్నారు.

యుద్ధం ఎప్పుడూ చివరి మార్గంగా మాత్రమే భావించాలి అని స్పష్టం చేశారు. “దౌత్యానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే పౌరుల పరిస్థితి యుద్ధ సమయంలో బహుళ దయనీయంగా మారుతుంది. షెల్లింగ్‌ మొదలైనప్పుడు చిన్నపిల్లలు కూడా రాత్రిపూట సురక్షిత ప్రాంతాలకే పరుగులు తీస్తారు. ఇది ఎటువంటి ప్రభావం చూపుతుందో ఊహించలేము,” అని ఆయన చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్టు – ‘ఇది యుద్ధాల శకం కాదు’ అని పేర్కొన్నారు. “తెలివితక్కువ నిర్ణయాలు తీసుకునే కొందరితో పాటు కొన్ని పరిస్థితుల వల్ల యుద్ధం దిశగా వెళ్లాల్సి వచ్చినా, దానిని నివారించే ప్రయత్నమే మొదటిగా ఉండాలి. నేను ఓ సైనికుడిగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నా, దౌత్యమే మొదటి ఆప్షన్ కావాలి. చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమవుతుందని నమ్ముతున్నాను,” అని జనరల్ నరవణే వ్యాఖ్యానించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *