Delhi: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ వద్ద రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయి లభ్యమైంది.
కస్టమ్స్ అధికారులు ఆమె లగేజీని చెక్ చేస్తుండగా, ఆ మహిళ తాను NIA అధికారినని చెబుతూ బెదిరించే ప్రయత్నం చేసింది. నకిలీ ఐడీ కార్డు చూపించి బయటపడేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా, వాష్‌రూమ్‌లోకి వెళ్లి NIA జాకెట్ వేసుకుని బయటకు రావడానికి ప్రయత్నించింది.
కానీ ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు వెంటనే అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ మహిళను విచారిస్తున్న పోలీసులు, గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై దర్యాప్తు ప్రారంభించారు.

