Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ దీపికా పదుకునే పండంటి ఆడపిల్లకు సెప్టెంబర్ లో జన్మనిచ్చారు. దీపావళి సందర్భంగా వీరు తమ కుమార్తెకు పేరు పెట్టారు. శుక్రవారం సాయంత్రం పాప పాదాలు కనిపించేలా ఓ ఫోటోను సోషల్ మీడియాలో వారు పోస్ట్ చేశారు. దీనితో పాటే తమ ఇద్దరి ఫోటోలనూ కూడా జత చేస్తూ తమ పాప పేరు ‘దువా పదుకొనే సింగ్’ అని రాసుకొచ్చారు. ‘దువా’ అంటే ప్రార్థన అని అర్థం. బహుశా తమ ప్రార్థన ప్రతి రూపం ఈ పాప అనేది వారి భావన కావచ్చు. ఇదిలా ఉంటే దీపావళి కానుకగా నవంబర్ 1న విడుదలైన ‘సింగం ఎగైన్’లో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషించగా, రణవీర్ సింగ్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చాడు.