Telangana: తెలంగాణ రాష్ట్రంలో 3,34,26,323 మంది ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తేల్చింది. కొత్తగా 8 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యారు. 4.14 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఈ విషయాలను తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం వెల్లడించారు.
Telangana: రాష్ట్రవ్యాప్తంగా 4,73,838 మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 35,907 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, కొత్తగా 551 కేంద్రాలు పెరిగాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాపై ఈ నెల 28 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారని, జనవరి 6న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు.