Medchel: మేడ్చల్ జిల్లా తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామ శివారులో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యం అయింది. తాడ్వాయి ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రహ్మాజివాడి గ్రామ శివారులో సిద్ధులగుట్టకు వెళ్లే మార్గంలో ఒక గుంతలో మృతదేహంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుంతలో ఉన్న మృతదేహన్ని స్థానికుల సహాయంతో వెలికితిసి పరిశీలించగా, మృతదేహం మగ మనిషిదిగా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Sexually Assaulted: విద్యార్ధినిపై స్కూల్ టీచర్ లైంగిక దాడి..స్తంభానికి కట్టేసి చితకొట్టిన కుటుంబసభ్యులు
మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి దాదాపుగా 30 రోజులు అవుతుండచ్చు అని అన్నారు. మృతదేహం ఒంటిపైన నలుపు రంగు నైట్ పెయింట్, నీలం రంగు, ఎరుపు రంగు డబ్బాల చొక్కా, నారింజ రంగు డబ్బాల టవల్ గా గుర్తించారు. మృతుడి వయస్సు సుమారుగా 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండవచ్చు అని ఎస్ఐ తెలిపారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు. సంఘటనా స్థలానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసు, ఇంచార్జ్ సీఐ శ్రీనివాస్ చేరుకుని పరిశీలించారు.