చౌకబారు విమర్శలు మానుకోవాలని కేటీఆర్కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా హెచ్చరిక చేశారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో పదేళ్లుగా ఆరోగ్యశ్రీని భ్రష్టు పట్టించింది కాకుండా.. ఇప్పుడు అనవసర విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. “ఆయన హయాంలో, ఆరోగ్యశ్రీ రోగులకు ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా లేదా ప్యాకేజీ రేట్లను సవరించకుండా చికిత్సను తిరస్కరించారు. EHS కింద చికిత్స కోసం వచ్చిన ఉద్యోగులు-పెన్షనర్లను కంపెనీ ఆసుపత్రుల యజమానులు అవమానించారు. పదేళ్ల పాటు చేసిన మోసాలు సరిపోవన్నట్టు మరోసారి హడావుడిగా పింఛనుదారులను మోసం చేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇప్పుడు పనిచేసే ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.” అంటూ మంత్రి దామోదర మాజీ మంత్రి కేటీఆర్ పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన Xలో ఒక పోస్ట్ చేశారు. మంత్రి ట్వీట్ ఇక్కడ మీరు చూడొచ్చు.
🔹చవకబారు విమర్శలు మానుకోవాలని కేటీఆర్కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా హెచ్చరిక
▪️ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ స్కీమ్లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్, ఇప్పుడు నీతులు చెప్పేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటు.
▪️హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల… pic.twitter.com/IHPQSsuvMM
— Damodar Raja Narasimha (@DamodarCilarapu) September 20, 2024

