Devara: యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా ‘దేవర’. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసి తన నట విశ్వరూపం చూపించారు. ‘దేవర’ రెండో భాగం కూడా రాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ‘దావుదీ’ సాంగ్ వీడియోను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. నిజానికి ఈ సినిమా విడుదలైనప్పుడు కొద్ది రోజుల పాటు ఈ పాటను ఎడిట్ చేశారు. ఆ తర్వాత మనసు మార్చుకున్న దర్శక నిర్మాతలు పాటను జత చేశారు. ఇప్పుడీ పూర్తి పాట వీడియోగా రావడంతో ఎన్టీఆర్ అభిమానులు, సినిమాను మొదటి రెండు వారాల్లో చూసిన వారు దీనిని తిలకించే ఆస్కారం ఏర్పడింది.
