Narudi Brathuku Natana

Narudi Brathuku Natana: ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పిన ‘నరుడి బ్రతుకు నటన’ టీమ్

Narudi Brathuku Natana: శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం అక్టోబర్ 25న విడుదలైంది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. రిషికేశ్వర్ యోగి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు చక్కని స్పందన లభిస్తోందని చిత్ర బృందం సోమవారం ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్ లో తెలిపింది. రివ్యూవర్స్ నుండి తమకు మంచి రేటింగ్స్ వచ్చాయని, పాత్రికేయులు ఈ సినిమాను మెచ్చుకున్నారని, మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు సైతం ఆదరిస్తారనేది మరోసారి రుజువైందని అన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు దర్శకుడు రిషికేశ్వర్ యోగి, నిర్మాతల్లో ఒకరైన సింధురెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాను చూడని వారు దయచేసి థియేటర్లకు వెళ్లి చూడాల్సిందిగా వారు కోరారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  James Bond: జేమ్స్ బాండ్ కొత్త అధ్యాయం.. సంచలన డైరెక్టర్‌ ఫిక్స్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *