Daaku Maharaj Review

Daaku Maharaaj Review: ఇది కదా సంక్రాంతి సినిమా అనిపించిన బాలయ్య బాబు! డాకు మహారాజ్ ఎలా ఉందంటే..

Daaku Maharaaj Review: తెలుగు రాష్ట్రాలకు పండగ మూడు రోజుల ముందే ప్రారంభం అయిపొయింది. గేమ్ ఛేంజర్ తో స్లో గా మొదలైన పండగ హంగామా ఇప్పుడు బలయ్య బాబు ఎంట్రీతో టాప్ కి చేరుకుంది. అవును.. డాకూ మహారాజ్ ఇప్పుడు ప్రేక్షకులకు సరికొత్త కిక్ ఇస్తోంది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయినా డాకూ మహారాజ్ అంచనాలను ఏ రేంజ్ కి అందుకుందో తెల్సుకోవాలంటే రివ్యూ చూసేయాల్సిందే. 

సంక్రాతి సినిమా.. అదీ బాలయ్య సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటుందనేది ప్రేక్షకులకు గట్టి నమ్మకం. ఇదిగో డాకూ మహారాజు అదే నిరూపించింది. సాధారణ కథతో.. నలిగి నలిగిపోయిన స్టోరీ లైన్ తో డాకూ మహారాజ్ వచ్చింది. అందుకే కథ గురించి రెండు లైన్లలో సింపుల్ గ చెప్పుకుందాం. మధ్య ప్రదేశ్ నుంచి ఒక వ్యక్తి ఒక చిన్నారిని రక్షించడానికి వస్తాడు. అసలు ఆ చిన్నారి ఎవరు? ఆమెకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇంతకీ పాపకి.. మధ్య ప్రదేశ్ నుంచి వచ్చిన హీరోకి.. డాకూకి ఉన్న లింక్ ఏమిటి? చిన్నారిని ఎలా రక్షించాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే డాకూ మహారాజ్. ఇలాంటి స్టోరీ లైన్ తో చాలా సినిమాలు వచ్చాయి. అందులోనూ బాలకృష్ణ ఇలాంటి లైన్ లో ఎన్నో సినిమాలు చేశారు. 

అయితే.. ఇలాంటి స్టోరీ లైన్ తో ఒక అద్భుతమే జరిగింది. అది కథనంతో.. ఫస్ట్ హాఫ్ అంతా బాలయ్య బాబు ఎలివేషన్స్ థియేటర్ లో ప్రేక్షకులను సీట్లలో కూచోనివ్వవు. సెకండ్ హాఫ్  ఎమోషన్స్.. యాక్షన్.. ప్రేక్షకులకు  ఫుల్ వినోదాన్ని ఇచ్చేస్తాయి. డైరెక్టర్ బాబీ తనదైన స్టైల్ లో బాలకృష్ణ ఇమేజ్ చుట్టూ సీన్స్ అల్లుకుంటూ వాటిని ఎలివేట్ చేసుకుంటూ సంక్రాంతికి ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇచ్చేశాడు. 

ఇది కూడా చదవండి: Sukumar: చరిత్ర సృష్టించిన సుకుమార్.. స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Daaku Maharaaj Review: బాబీ డైరెక్షన్ కి తమన్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇచ్చింది. అసలు సినిమా చూస్తున్నంత సేపూ ఎక్కడా కూడా మనకి మరో ఆలోచన రాదు.. సీన్ సీన్ కి వెనుక వచ్చే బీట్ మెస్మరైజ్ చేస్తుంది. తమన్ ఎక్కడో అన్నాడు రజనీకి బక్కోడు.. బాలయ్యకి బండోడు అని ఆ మాట నూటికి నూరు శాతం నిజం చేశాడు. ఇక ఫొటోగ్రఫీ అయితే చెప్పనవసరం లేదు. విజువల్ వండర్ అనేది ఎదో గ్రాఫిక్స్ సినిమాలకు వాడతాం. కానీ, ఇలాంటి సినిమాల్లో కూడా అంత అద్భుతమైన విజువల్స్ ఇవ్వచ్చు అనేది విజయ్ కార్తీక్ చూపించాడు. టెక్నీకల్ గా ఎక్కడా కూడా సినిమాకి పేరు పెట్టడానికే లేదంటే అతిశయోక్తి కాదు. 

ALSO READ  Kalki New Record: కల్కి 2898 ఎ.డి. సరికొత్త రికార్డ్

డైలాగ్స్-యాక్షన్ -మెలోడ్రామా ఈ మూడు డాకూ మహారాజ్ ని మాస్ అండ్ క్లాస్ ఫ్యామిలీ ప్యాక్ లా చేశాయి. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఒక్క గుద్దుడు పాట తప్ప. నిజానికి ఆ పాట అవసరం లేదు. కానీ, ఇరికించారు. 

కథ విషయం పక్కన పెట్టి పండక్కి ఒక మంచి యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ టచ్ తో ఉన్న మాస్ మూవీ చూడాలంటే కచ్చితంగా డాకూ మహారాజ్ చూడొచ్చు. ఫ్యామిలీతో కల్సి ఎంజాయ్ చేయగలిగిన సంక్రాంతి మూవీ ఇది. గేమ్ ఛేంజర్ భోగి సినిమా.. పండగను మెల్లగా మొదలు పెట్టించింది. బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా సంక్రాతి పండగ తెచ్చింది. 

ఇంకా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ స్క్రీన్ మీద మంచి స్కోప్ ఉన్న సీన్లు పడ్డాయి. అందరూ తమ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. బాలయ్య బాబు గురించి చెప్పక్కర్లేదు కానీ.. ఇందులో మిగిలిన నటులు అంతా కూడా ఎక్కడా తగ్గకుండా బాబీ అనుకున్నట్టు స్క్రీన్ మీద నిండుగా కనిపించారు. 

చివరిగా బాబీ ప్లస్ బాలయ్య ఎలివేషన్స్ తో మెస్మరైజ్ చేశారు. ఒకవేళ మీరు కొత్తదనం కోరుకుంటే మాత్రం నిరాశ తప్పదు. కానీ, కొత్తగా బాలయ్యను చూడాలంటే మాత్రం డాకు మహారాజ్ ఒక అద్భుతమైన సినిమా!

గమనిక: ఈ రివ్యూ రివ్యూయర్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మహా న్యూస్ సినిమా చూడాలని లేదా చూడవద్దని ఎటువంటి సూచనలు చేయడం లేదు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *