Crime News: మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. మతిస్థిమితం లేని మహిళపై దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే, హైవేకు సమీపంలోనే ఉన్న ఈ ప్రాంతంలో సామూహిక లైంగికదాడి జరగడం రక్షణ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
Crime News: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ గ్రామంలోని స్టేజీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఉన్నది. మరో మహిళ తప్పిపోయిన విషయంపై స్టేజీ సమీపంలో ఉన్న ఓ దాబా హోటల్ సీసీ టీవీలను పరిశీలించగా, ఈ దారుణం బయటపడింది. అంబేద్కర్ విగ్రహం వెనుకాల మతిస్థిమితం లేని మహిళ తలదాచుకుంటున్నది. ఆమెపై ముగ్గురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన విషయం వెల్లడైంది.
Crime News: మతిస్థిమితంలేని మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మతిస్థిమితంలేని మహిళ తన విషయాలను చెప్పలేకపోతుండటంతో ఆమెను పోలీసులు భరోసా కేంద్రానికి తరలించారు.